Advertisementt

అప్పుడు మాధవన్.. ఇప్పుడు అరవింద్ స్వామి

Wed 28th Sep 2022 05:54 PM
naga chaitanya,nc22,aravind swami  అప్పుడు మాధవన్.. ఇప్పుడు అరవింద్ స్వామి
Arvind Swami to fight Naga Chaitanya after Ram Charan అప్పుడు మాధవన్.. ఇప్పుడు అరవింద్ స్వామి
Advertisement
Ads by CJ

సవ్యసాచి చిత్రంలో యంగ్ హీరో నాగ చైతన్య తమిళ హీరో మాధవన్ తో తలపడ్డాడు. సవ్యసాచిలో మాధవన్ స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నారు. చైతు vs మాధవన్ అన్న రేంజ్ లో ఉంటుంది ఆ చిత్రం. కానీ ఆ చిత్రం చైతూకి నిరాశని మిగిల్చింది. ఇప్పుడు మరోసారి తమిళ నటుడు అరవింద్ స్వామితో నాగ చైతన్య తలపడబోతున్నాడు. నాగ చైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో బైలింగువల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఆ మూవీ షూట్ మొదలయ్యింది. 

ఈ చిత్రంలోనే నాగ చైతన్య కి విలన్ గా అరవింద్ స్వామి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఫార్మాలిటీస్ పూర్తికాగా.. ఆయన మైసూర్ లో జరగబోయే కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అరవింద్ స్వామి ఇంతకుముందే రామ్ చరణ్ కి స్టైలిష్ విలన్ గా ధ్రువ చిత్రంలో అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చైతు విలన్ గా ఎలా కనిపించబోతున్నారో అనే క్యూరియాసిటీ అక్కినేని ఫాన్స్ లో మొదలయ్యింది. ఇక #NC22 చిత్రంలో నాగ చైతన్య తో మరోసారి కృతి శెట్టి నటిస్తుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ గా కనిపించబోతున్నాడు. 

Arvind Swami to fight Naga Chaitanya after Ram Charan:

Naga Chaitanya to fight Aravind Swami

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ