ఈరోజు అనంతపురంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 5 న దసరా స్పెషల్ గా రిలీజ్ కాబోయే గాడ్ ఫాదర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సల్మాన్ ఖాన్, నయనతార లాంటి అగ్రనటులు గాడ్ ఫాదర్ లో నటించడంతో ఈ చిత్రం మరింత స్పెషల్ గా మారింది. అయితే ఈ రోజు సెప్టెంబర్ 28 న అనంతపురంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని ప్రచారం గట్టిగానే జరిగింది.
కానీ పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉండడంతో గాడ్ ఫాదర్ కి గెస్ట్ గా, గాడ్ ఫాదర్ వన్ అఫ్ ద నిర్మాతగా రామ్ చరణ్ హాజరవుతున్నారు. నిన్నగాక మొన్న నాగార్జున ద ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరగగా.. ఆ ఈవెంట్ కి నాగ్ ఇద్దరి కొడుకులు అఖిల్, నాగ చైతన్య లు స్పెషల్ గెస్ట్ లుగా హరాజయ్యారు. ఇప్పుడు మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ కోసం ఆయన కొడుకు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారు. ఈ రోజు ఈవెనింగ్ అనంతపురం మొత్తం గాడ్ ఫాదర్ మ్యానియా తో మెగా ఫాన్స్ ఊగిపోవడం ఖాయం. ఇప్పటికే మెగా ఫాన్స్ బైక్ ర్యాలీలు అంటూ హడావిడి చేస్తున్నారు.