కోలీవుడ్ హీరో విశాల్ ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసినట్లుగా విశాల్ చెన్నై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. విశాల్ చెన్నై లోని అన్నానగర్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. మంగళవారం రాత్రి విశాల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. రెడ్ కలర్ కారులో వచ్చిన దుండగులు విశాల్ ఇంటిపై రాళ్లు విసిరారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో రెడ్ కలర్ కారుని గుర్తించిన విశాల్ తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాల్ ఇంటిపై రాళ్ల దాడి చేసిన వ్యక్తులు ఎవరో కూడా తెలియదని, వాళ్ళు ఎందుకు ఇలా చేసారో అని, కానీ రాళ్లు విసురుతూ విధ్వంశం సృష్టించడంతో విశాల్ మేనేజర్ తో పోలీస్ కంప్లైంట్ ఇప్పించినట్లుగా తెలుస్తుంది. హీరోగా సినిమాలు చేస్తూనే.. అటు నడిగర్ సంగం ఎన్నికల విషయంలో విశాల్ చాలామందికి శత్రువుగా మారాడు. దూకుడుగా ఉండే విశాల్ అంటే పడని వారు చాలా మంది ఉన్నారనేది కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. అలాంటి వారిలో ఎవరో కొందరే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని అంటున్నారు.