Advertisementt

బింబిసార రాక కూడా ఖాయమైనట్టే

Tue 27th Sep 2022 04:42 PM
bimbisara,kalyan ram,bimbisara ott release date  బింబిసార రాక కూడా ఖాయమైనట్టే
Bimbisara OTT streaming date and release partner revealed బింబిసార రాక కూడా ఖాయమైనట్టే
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో ఆడియన్స్ 3న విడుదలైన బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా కళ్యాణ్ రామ్ కి ఊహించని కలెక్షన్స్ అందించింది. ఈ సినిమా తో పాటుగా విడుదలైన సీతారామం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎప్పటినుంచో సీతారామం ఓటిటిలో సందడి చేస్తుంది. కానీ కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఇంతవరకు ఓటిటి రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఇంకా ఇంకా సస్పెన్స్ లోనే పెట్టారు మేకర్స్. 

అయితే బింబిసార ఓటిటి హక్కులని దక్కించుకున్న జీ 5 బింబిసారా డిజిటల్ రిలీజ్ కి ముహూర్తం పెట్టేసింది. దసరా స్పెషల్ గా అక్టోబర్ 7 న బింబిసారా ఓటిటి రిలీజ్ ఉండబోతుంది. ఇంతవరకు అధికారికంగా డేట్ ప్రకటించకపోయినా క్రేజీ హిట్ కార్తికేయ 2 ని అక్టోబర్ 5 దసరా రోజున, అక్టోబర్ 7 న బింబిసారా సినిమాలను రిలీజ్ చెయ్యబోతున్నారు. సో ఒకే వారంలో రెండు సూపర్ హిట్ మూవీస్ ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యొచ్చన్నమాట.

Bimbisara OTT streaming date and release partner revealed :

Bimbisara OTT Release Date confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ