Advertisementt

రష్మిక డెసిషన్ బావుంది

Tue 27th Sep 2022 03:08 PM
rashmika mandanna,hindi,tamil  రష్మిక డెసిషన్ బావుంది
Rashmika decision is good రష్మిక డెసిషన్ బావుంది
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో పూజ హెగ్డే మూడు వరస ప్లాప్ లతో డల్ గా కనిపిస్తుండగా.. అదే సమయంలో రష్మిక జోరు దూకుడు పెరిగింది. తెలుగులో పుష్ప పాన్ ఇండియా హిట్ తో రష్మిక పేరు మోగిపోతుంది. అటు తమిళనాట విజయ్ తో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ఇటు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. తాజాగా రష్మిక గుడ్ బై ప్రమోషన్స్ లో భాగంగా ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెప్పింది. ఏ భాషలో చేసినా ఆ భాషలోనే తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకుంటేనే మజా ఉంటుంది అంటుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకుంటే అప్పుడే నటిగా నాకు తృప్తి ఉంటుంది అని చెబుతుంది.

ఆడియన్స్ నా కోసం థియేటర్స్ కి వస్తున్నప్పుడు నా మొహమే కనిపించాలి, అలాగే నా స్వరమే వినిపించాలి. నా పాత్ర కనబడి, వేరే వాయిస్ వినిపిస్తే నటిగా నాకు తృప్తి ఉండదు అని చెబుతుంది. ఇప్పటికి షూటింగ్ అయ్యాక ఇంటికెళ్లి ఆయా భాషలు నేర్చుకోవడానికి క్లాస్ లు తీసుకుంటాను అని, ప్రస్తుతం తమిళ, హిందీ భాషలు నేర్చుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది రష్మిక. ఎప్పటినుండో తెలుగులో రష్మిక తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.

Rashmika decision is good:

Rashmika Mandanna: Dubbing in Hindi was a little challenging

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ