రష్మిక కోలీవుడ్ లో కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ తో తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా రష్మిక కి నిరాశే మిగిల్చినా ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ తో వారాసి లో నటిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. కోలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్ గా మారుతున్న రశ్మికకి మరోసారి కార్తీ సినిమాలోనే ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో కార్తీ లేటెస్ట్ చిత్రం సర్దార్ కూడా విడుదలకి సిద్దమవుతుంది. ఆ తర్వాత కార్తీ రాజు మురుగన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
ఆ చిత్రంలోనే కార్తీక్ జోడిగా రశ్మికని ఫైనల్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలుగు, హిందీలో క్రేజీ ఆఫర్స్ తో టాప్ హీరోయిన్ గా మారిన రష్మిక ని కార్తీకి జోడిగా నటింపచేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. కార్తీ-మురుగన్ చిత్రనికి జపాన్ టైటిల్ ని పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రశ్మికని హీరోయిన్ గా ఎంపిక చేసి అధికారిక ప్రకటన ఇచ్చే యోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఇప్పటికే తెలుగులో పుష్ప పాన్ ఇండియా ఫిలిం, అలాగే బాలీవుడ్ లో నాలుగైదు ప్రాజెక్ట్ తో బిజీగా వుంది రష్మిక. ఈ ఆఫర్ కూడా తగిలితే కోలీవుడ్ లోను రశ్మికకి తిరుగుండదు.