ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సలార్ షూటింగ్ కి చిన్నపాటి బ్రేక్ ఇచ్చి రేపు సాయంత్రం ప్రభాస్ ఈ నెల 29 న మొగళ్తూరు లో జరగబోయే కృష్ణంరాజు గారి సంస్మరణ సభ కోసం వెళ్లనున్నారు. తర్వాత సలార్-ప్రాజెక్ట్ K షూటింగ్స్ కి హాజరవుతారు. ఇక తర్వాత ప్రభాస్ మారుతీ తో చేయబోతే మూవీలోకి కూడా నవంబర్ నుండి జాయిన్ అవుతారని తెలుస్తుంది. మారుతి కూడా ప్రభాస్ కోసం పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నారని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. రాజా డీలక్స్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ ప్రభాస్ తో రొమాన్స్ చేస్తారట.
ఇక ఇప్పుడు మారుతీ KGF విలన్ అధీర సంజయ్ దత్ ని ప్రభాస్ కోసం విలన్ గా ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు సంజయ్ దత్ తో చర్చలు కూడా మొదలుపెట్టారని టాక్. మారుతి కథకు సంజయ్ దత్ ఓకే చెప్తే మరోసారి ఇండియన్ సినిమాలో క్రేజీ కాంబినేషన్ వెండితెరపై చూడొచ్చు. KGF2 లో పవర్ ఫుల్ విలన్ గా సంజయ్ దత్ యశ్ తో తలపడగా.. ఆ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. నార్త్ ఇండియాలోనూ KGF ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు మారుతి కూడా నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చెయ్యడానికే ఇలా బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.