బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యింది. మూడు వారాలకి ముగ్గురు ఎలిమినేట్ కాగా.. నాలుగో వారంలో ఏకంగా పది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారం ఇనాయ vs శ్రీహన్ మధ్యలో నామినేషన్స్ హీట్ కనిపించగా, సుదీప కూడా ఇనయతో గొడవకు దిగింది. ఇక రేవంత్ ని కూడా హౌస్ లో ఉన్నవారు చాలామంది టార్గెట్ చేసారు. రేవంత్-కీర్తి భట్ కి మధ్యన ఫైట్ జరిగింది. బాధలో ఉంది టాస్క్ పెరఫార్మెన్స్ ఇవ్వడం లేదు అని రేవంత్ అన్నాడంటూ కీర్తి రేవంత్ ని నామినేట్ చెయ్యడంతో రేవంత్ కీర్తికి మాటకు మాట అప్పజెప్పాడు.
ఇక ఆరోహి-ఫైమా మధ్యన కూడా ఫైట్ రసవత్తరంగానే అనిపించింది. వెనుక ఎన్ని కెమెరాలు ఉన్నాయో, ముందు కూడా అన్ని కెమెరాలు ఉన్నాయి. నువ్ ఎంత పర్ఫామెన్స్ ఇస్తే.. నేను కూడా అంతే ఇస్తా అంటూ ఫైమా ఫైర్ అవ్వగా.. నువ్ అందరినీ మించిన పర్ఫామెన్స్ ఇస్తావ్. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు అని ఆరోహి అంది. దీనికి థ్యాంక్యూ అందుకే ఇక్కడికి పిలిచారు అంటూ ఫైమా కూడా వెటకారం చేసింది. ఇక ఈ వారం ఫైనల్ గా నామినేషన్స్ లోకి ఏకంగా పదిమంది నిలబడ్డారు. అందులో అర్జున్ కళ్యాణ్-కీర్తిలను నాగార్జున డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి తీసుకెళ్లగా.. ఈ వారం సుదీప, ఆరోహి, శ్రీహాన్, ఇనయా, రాజ్, సూర్య, రేవంత్, గీతూ నామినేట్ అయ్యారు.