చిరంజీవి-నాగార్జున ఇద్దరు అగ్ర హీరోలు నటించిన రెండు సినిమాలు దసరా కానుకగా ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. నిజానికి ఎంత పండగ సీజన్ అయినా సరే ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవడం అనేది అంత హెల్దీ ఎట్మాస్ ఫియర్ కాదనే చెప్పాలి. అందులోను ముఖ్యంగా చిరంజీవి-నాగార్జున ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసిందే. వాళ్లిద్దరూ ఓ మాటనుకున్నా.. రిలీజ్ డేట్స్ ఒకరోజు ముందు వెనక అయ్యేవి. నాగార్జునకి గనక శివ రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఉండి ఉంటే.. చిరంజీవి ఒకరోజు ముందుకో వెనక్కో జరిగే అవకాశం ఉండి ఉండేది. అయినా కూడా ఇద్దరూ తమ సినిమాల రిలీజ్ ల విషయంలో అంత పట్టుబట్టుకుని ఉన్నారనే దానికి ఓ ముఖ్య కారణం ఉందని తెలుస్తుంది.
అది ఏమిటంటే.. కథ.. గాడ్ ఫాదర్ లూసిఫర్ రీమేక్, ఘోస్ట్ స్ట్రయిట్ సినిమా కదా అని మీరనుకోవచ్చు. కానీ ఆ రెండు కథలు తిరిగేది సిస్టర్ సెంటిమెంట్ చుట్టూనే. గాడ్ ఫాదర్ లో రాజకీయనేపథ్యం ఉన్నప్పటికీ చెల్లిని కాపాడే అన్నగా కనిపించబోతున్నారు చిరంజీవి. ఘోస్ట్ సినిమాలో ఇంటర్ పోల్, మాఫియా ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పటికీ అక్కని కాపాడే తమ్ముడిగా కనిపించబోతున్నారు నాగార్జున. బేసిక్ గా రెండు సినిమాలు సిస్టర్ సెంటిమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్న సినిమాలే. ఏది ముందు వచ్చినా.. ఏది తర్వాత వచ్చినా ఆ కంపారిజన్ ఉంటుంది అనే ఆలోచన సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున కి తెలుసు గనకే ఒకే రోజున వచ్చేసేందుకు సిద్దపడిపోయారనేది ఇన్ సైడ్ టాక్. గాడ్ ఫాదర్, ఘోస్ట్ ట్రైలర్స్ చూసిన వారికి ఇది ఆల్మోస్ట్ అర్ధమయ్యే ఉంటుంది.