మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించడం, కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార చిరు కి సిస్టర్ కేరెక్టర్ చెయ్యడంతో ఈ ప్రాజెక్ట్ బిగ్ ప్రాజెక్ట్ గా మారిపోయింది. అలాగే హిందీలోనూ ఈ సినిమాపై క్రేజీ అంచనాలు మొదలయ్యాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో సత్య దేవ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న నటుడిగా నటించడం అనేది చాలామందికి నచ్ఛలేదు. అంటే చిన్న నటుడు ఇలాంటి ప్రాజెక్ట్ లో విలన్ గా వేస్తె ఏం క్రేజ్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం సత్య దేవ్ ఆ పాత్ర చెయ్యడం అనేది నా చాయిస్ అంటున్నారు. ఆయన ఈమధ్యన ఫ్లైట్ లో శ్రీముఖి తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూ లో నయనతార తో ఈక్వల్ గా సత్యదేవ్ చేసారు.. ఆయన పాత్ర ఏమిటి అని శ్రీముఖి అడిగింది. దానికి మెగాస్టార్ సత్య దేవ్ ది నా చాయిస్. ఈమధ్యన అతను సినిమాలు చేసే విధానం.. అతను చేసే పాత్రలు చూస్తుంటే ఎంతో ఇంటెన్సివ్ ఉన్న ఆక్టర్ గా అనిపించాడు. పది సినిమాల ఎక్స్ పీరియన్స్ లో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. అతని వాయిస్ కానీ, అతన్ని అతను ప్రొజెక్ట్ చేసే విధానం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎంచుకున్నాం. హీరోగా చేస్తున్నాడు, ఇలా ఇప్పుడు ప్రతి నాయకుడి పాత్ర ఇది. నువ్ హీరోగా సినిమాలు చేస్తున్నావ్.. ఇప్పుడు ఈ పాత్ర చేస్తావా అంటే.. మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు.. నా అభిమాన కథానాయకుడి సినిమాలో చెయ్యడం నా అదృష్టం నేను చేస్తాను అన్నాడు. అతను చాలా బాగా చేసాడు. సత్య దేవ్ ఈ పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసాడు అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు.