Advertisementt

ఫైనల్లీ కార్తికేయ2 కి ఓటిటి డేట్ ఇస్తున్నారు

Mon 26th Sep 2022 06:20 PM
karthikeya 2,nikhil,karthikeya 2 ott premiere  ఫైనల్లీ కార్తికేయ2 కి ఓటిటి డేట్ ఇస్తున్నారు
Karthikeya 2 OTT date fix ఫైనల్లీ కార్తికేయ2 కి ఓటిటి డేట్ ఇస్తున్నారు
Advertisement
Ads by CJ

నిఖిల్ రీసెంట్ మూవీ కార్తికేయ 2 పాన్ ఇండియాలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా నిలిచిపోయింది. కార్తికేయ కాన్సెప్ట్ హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో అక్కడ కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్, సినిమాలో బలమైన కథ ఉండడంతో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా కార్తికేయ2 నిలవగా.. ఈ సూపర్ హిట్ మూవీ ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు అనుకుంటున్నారు. 

కానీ మేకర్స్ కార్తికేయ 2 ఓటిటి డేట్ ఇవ్వకుండా ఇంకా ఇంకా వెయిట్ చేయిస్తున్నారు. కార్తికేయ 2 ఓటిటి రైట్స్ ని జీ 5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జీ ఫైవ్ లో కార్తికేయ 2 అని యాడ్స్ వస్తున్నా ఇంకా డేట్ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తాజాగా కార్తికేయ 2 ని దసరా స్పెషల్ గా అక్టోబర్ 5 న ఓటిటిలో ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. రెండు రోజుల్లో ఈ విషయమై జీ 5 నుండి అధికారిక ప్రకటన కూడా వస్తుంది అంటున్నారు. సో ఈ దసరాని కార్తికేయ 2 తో సెలెబ్రేట్ చేసుకోవచ్చన్నమాట.

Karthikeya 2 OTT date fix:

Karthikeya 2 OTT premiere on ZEE5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ