అల్లు అర్జున్ పుష్ప రాజ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ తో శెభాష్ అనిపించుకున్నారు. సుకుమార్ పుష్ప మేకింగ్ తో అందరి ప్రశంశలు పొందారు. అలాంటి కాంబోలో పుష్ప 2 రాబోతుంది అంటే.. ఆ అంచనాలు ఎంతుండాలి, ఏ రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు పార్ట్ 2 పై అదే అంచనాలు కంటిన్యూ అవుతున్నా పుష్ప షూటింగ్ ఇంకా మొదలే కాలేదు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు నిర్వహించిన యూనిట్ రెగ్యులర్ షూటింగ్ పై అప్ డేట్ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ అక్టోబర్ 1 నుండి మొదలవుతుంది అంటున్నారు.
ఆరోజే అల్లు స్టూడియో ఓపెనింగ్ చేసి అక్కడే అల్లు స్టూడియోలోనే పుష్ప 2 రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి.. వెంటనే మరోసారి మారేడుమిల్లుకి చిత్ర బృందం బయలుదేరనుంది అని తెలుస్తుంది. ఆ టైం కల్లా రష్మిక కూడా గుడ్ బై ప్రమోషన్ ముగించేసి పుష్ప 2 షూట్ లో జాయిన్ అవుతుందట. సుకుమార్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.