బిగ్ బాస్ సీజన్ 6 మూడో వారంలో అనూహ్యంగా నేహా చౌదరి ఎలిమినేట్ అవడం ఆమెకే కాదు, ఆమె ఫాన్స్ కి నచ్చడం లేదు. నేహా చౌదరి కన్నా తక్కువగా టాస్క్ పెరఫార్మెన్స్ చేసే వాసంతి, కీర్తి లాంటి వాళ్లకు ఉండగా.. బెటర్ కాకపోయినా ఎంతోకొంత మంచిగా ఆడిన నేహా చౌదరి ని ఎలిమినేట్ చెయ్యడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులే కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన నేహా చౌదరి మొదటి రెండు వారాల్లో అందరితో కలివిడిగా మాట్లాడి అందరిని కలుపుకెళ్లింది.
కానీ మూడో వారంలో గాయాలతో టాస్క్ విషయంలో కొద్దిగా తగ్గినప్పటికీ.. వాసంతి, కీర్తి ల మీద బెటర్ గానే కనిపించింది. అయితే ఇనాయ తనని చెంప దెబ్బకొట్టింది అంటూ నేహా చౌదరి అన్నప్పటికీ అది నిజం కాదని నాగార్జునే రుజువు చేసారు. మరి ఎందువల్లో ఆమెకి ఓటింగ్ శాతం తక్కువ ఉండడంతో ఆమెని ఈ వారం ఎలిమినేట్ చెయ్యగా.. నేను నమ్మిన వాళ్ళే నన్ను ముంచారంటూ.. వాళ్ల వల్లే ఎలిమినేట్ అయ్యానన్న బాధ, కోపంతో బయటకు వెళ్తున్నా అంటూ నేహా కూడా ఏడ్చేసింది. వాసంతి-నేహా ఎలిమినేషన్స్ ప్రక్రియలో నేహా ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోయింది. నేహా వెళుతూ.. వెళుతూ.. దుమ్ము అంటూ రేవంత్, ఇనయా, ఆరోహి, వాసంతి, గీతూ రాయల్ ఫొటోలను పెట్టింది. దమ్ము కంటెస్టెంట్స్ లో చంటి, సుదీప, రాజ్, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య ఫొటోస్ పెట్టింది.