Advertisementt

సమంత టీమ్ ప్లాన్ అదేనా..?

Sun 25th Sep 2022 09:31 PM
samantha,samantha team,rumours,heroine samantha,citadel,usa  సమంత టీమ్ ప్లాన్ అదేనా..?
To many rumours viral on Samantha సమంత టీమ్ ప్లాన్ అదేనా..?
Advertisement
Ads by CJ

సమంత.. గత పది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు. అసలామెకు ఏమైందో, ఎందుకు అమెరికా వెళ్లిందో తెలియదు కానీ.. ఇక్కడ మాత్రం రకరకాల వార్తలు ఆమెపై వైరల్ అవుతూనే ఉన్నాయి. ముందు స్కిన్ ఎలర్జీ కారణంగా ట్రీట్‌మెంట్ కోసం ఆమె అమెరికా వెళ్లిందని అన్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో చేయబోతున్న ఓ ఇండియన్ సిరీస్ కోసం శిక్షణ నిమిత్తం వెళ్లిందని అంటున్నారు. ఆమె మేనేజర్ కూడా సరైన క్లారిటీ ఇవ్వకుండా.. ట్రీట్‌మెంట్ కోసమైతే ఆమె అమెరికా వెళ్లలేదని అన్నాడు కానీ.. ఎందుకు వెళ్లిందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో, ఆమె ఎక్కడున్నా కూడా.. ఇలా కన్ఫ్యూజ్ చేస్తే.. ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ప్లాన్ చేస్తున్నారో.. ఏమో తెలియదు కానీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో వైరల్ అవుతూనే ఉంది.

 

ప్రజంట్ వినిపిస్తున్న వార్తల ప్రకారం.. సమంత అమెరికా వెళ్లింది ట్రీట్‌మెంట్ కోసం కాదట. రూసో బ్రదర్స్ అమెరికన్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’ను బాలీవుడ్‌లో రాజ్ అండ్ డీకే ఇండియన్ సిరీస్‌గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత ఓ శక్తివంతమైన పాత్రలో నటిస్తుందని, అందుకోసం శిక్షణ తీసుకునేందుకే అమె అమెరికా వెళ్లిందనేలా వార్తలు బయటికి వచ్చాయి. అయితే.. ఇక్కడ ఒక సినిమా షూటింగ్‌ని ఆపేసి మరీ వెళ్లాల్సిన అవసరం ఏమోచ్చింది..? అనేలా మళ్లీ అనుమానాలు మొదలయ్యాయ్. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ అనే సినిమాలో చేస్తుంది. సమంత అందుబాటులో లేక ఆ సినిమా షూటింగ్‌ని ఆపేసినట్లుగా రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. శిక్షణ కోసమైతే.. సమంత ఇలా చేయాల్సిన అవసరం లేనే లేదు. షూటింగ్ మధ్యలో శిక్షణ కోసమంటే.. ‘ఖుషి’ టీమ్ కూడా అంగీకరించే అవకాశాలు లేవు. కాబట్టి.. ఖచ్చితంగా ఆమె వెళ్లిన కారణం వేరే అనేలా.. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా.. ఆమె ఎక్కడున్నా కూడా.. ఆమె చుట్టూనే వార్తలు తిరిగేలా ఆమె టీమ్ మాత్రం బాగానే ప్లాన్ చేస్తుందనేది మాత్రం నిజం. 

To many rumours viral on Samantha:

Samantha Team Planning Superb

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ