Advertisementt

బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ లో ఆ ఇద్దరు

Sun 25th Sep 2022 12:58 PM
revanth,srimaan,danger zone,this week,bigg boss,  బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ లో ఆ ఇద్దరు
This week danger zone contestants list బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ లో ఆ ఇద్దరు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ మూడోవారానికి గాను పదిమంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈవారం నాగార్జున ఇచ్చిన క్లాస్ పని చెయ్యడంతో ప్రతి ఒక్కరూ తమ గేమ్ పెరఫార్మెన్స్ చూపించారు. నామినేషన్స్ లో లేని కీర్తి, అలాగే అర్జున్, ఆరోహిలు జీరో మినిట్స్ టాస్క్ లో అర్జున్ కళ్యాణ్ ఈ వారం జైలు పాలయ్యాడు. ఈ వారం మూడో కెప్టెన్ గా ఆది రెడ్డి గెలిచాడు. దానితో బాగా ఎమోషనల్ అయ్యి భార్యకి ఐ లవ్ యు చెప్పాడు. అదలా ఉంటే ఈ వారం నామినేషన్స్ పది మందిలో వాసంతి, ఇనాయా, శ్రీహాన్, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి, బాలాదిత్య, సింగర్ రేవంత్, గీతూ, సుదీపలు ఉన్నారు.

ఓటింగ్ పరంగా ఎప్పటిలాగే సింగర్ రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లుగా ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి. రెండో స్థానంలో కెప్టెన్సీ టాస్క్ లో పోరాడి ఓడిన శ్రీహాన్ ఉండగా.. పది మందిలో వీళ్లిద్దరికే దాదాపు నలభై శాతానికి పైగా ఓటింగ్ పోలైనట్లుగా తెలుస్తుంది. వీళ్ల తర్వాత స్థానాల్లో ఓటింగ్ పరంగా పెద్దగా మార్పులు ఏమి లేవని, అటు ఇటుగా మూడో స్థానంలో గీతూ, నాలుగో స్థానంలో బాలాదిత్య, ఐదో స్థానంలో వాసంతి, ఆరో స్థానంలో చలాకీ చంటీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓటింగ్‌లో ఇనాయా సుల్తానా మొదట్లో చివరి స్థానంలో ఉన్నప్పటికీ .. కెప్టెన్సీ టాస్క్ ముగిసే సరికి ఆమె ఏడో స్థానానికి వచ్చెయ్యగా.. తర్వాత ఆరోహీ ఎనిమిదో స్థానానికి, నేహా చౌదరి తొమ్మిదో స్థానానికి, సుదీప పదో స్థానానికి పడిపోవడంతో.. ఈ వారం డేంజర్ జోన్ లో సుదీప-నేహా చౌదరి ఉన్నట్లుగా తెలుస్తుంది. 

This week danger zone contestants list:

Revanth and Srimaan in danger zone in this week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ