Advertisementt

ప్రభాస్ అన్నా.. నువ్ గ్రేట్

Sat 24th Sep 2022 12:13 PM
prabhas,salaar movie,prashanth neel  ప్రభాస్ అన్నా.. నువ్ గ్రేట్
Prabhas Joins Salaar Sets ప్రభాస్ అన్నా.. నువ్ గ్రేట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫ్యామిలీకి అనుకోని కష్టం వచ్చింది. ప్రభాస్ తండ్రిలా భవించే ఆయన పెదనాన్న కృష్ణం రాజుగారి అకాల మరణం ఫ్యామిలీని కుదిపేసింది. కృష్ణం రాజుకి కొడుకులు లేని కారణంగా ప్రభాస్ ఆ ఇంటికి అన్ని తానై చూసుకోవాల్సిన పరిస్థితి. పుట్టెడు దుఖంలోనూ కృష్ణం రాజుకి శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలను పూర్తి చేసిన ప్రభాస్ ఈ గురువారం నుండి సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ సెట్స్ లో జాయిన్ అయ్యారు.

ఇది చూసిన ప్రభాస్ ఫాన్స్ అన్నా నువ్ గ్రేట్, ఇంత దుఃఖాన్ని దిగమింగుకుని నిర్మాతలు నష్టపోకూడదనే కారణంగా గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్ హజవతున్నావ్ నువ్ సూపర్ ప్రభాస్ అన్నా అంటూ ప్రభాస్ ఫాన్స్ ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్న కారణంగా ఆయన త్వరగా షూటింగ్స్ కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారు. అయితే మళ్ళీ ఈ నెల 29 న రెండు రోజులు షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని కృష్ణం రాజుగారి సొంతఊరు మొగళ్తూరికి వెళ్లనున్నారు ప్రభాస్. అక్కడ కృష్ణం రాజుగారి సంస్కరణ సభని వేలాదిమంది అభిమానుల మధ్యలో నిర్వహించనున్నారు.

Prabhas Joins Salaar Sets:

Prabhas returns back to the sets of Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ