Advertisementt

భారీ ప్రాజెక్ట్ ప్రకటించబోతున్న శ్రీను వైట్ల

Sat 24th Sep 2022 08:44 AM
sreenu vaitla,sreenu vaitla birthday  భారీ ప్రాజెక్ట్ ప్రకటించబోతున్న శ్రీను వైట్ల
Sreenu Vaitla.. New Biggie Announcement Soon భారీ ప్రాజెక్ట్ ప్రకటించబోతున్న శ్రీను వైట్ల
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాల్లో కామెడీ బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు శ్రీను వైట్ల.. కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. నీ కోసం తో దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రీను వైట్ల. అందరూ కొత్తవారితో నిర్మించిన ఆనందం తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ తో మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల దూకుడు తో తిరుగులేని హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన బాద్ షా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 

టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం.  నేడు (సెప్టెంబర్ 24) జన్మదినం జరుపుకుంటున్న శ్రీను వైట్ల అగ్ర హీరో తో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరో సారి తన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబందించిన ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. అద్భుతమైన కథ తో పాటు తన మార్క్ వినోదంతో వస్తున్న శ్రీను వైట్ల మరో భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే శ్రీను వైట్ల !!

Sreenu Vaitla.. New Biggie Announcement Soon :

Sreenu Vaitla birthday special update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ