Advertisementt

బిగ్ బాస్ 6: ఈవారం జైలుకి వెళ్లిందెవరో..

Fri 23rd Sep 2022 08:10 PM
bigg boss 6,arohi,arjun kalyan  బిగ్ బాస్ 6: ఈవారం జైలుకి వెళ్లిందెవరో..
Bigg Boss 6: Today Promo viral బిగ్ బాస్ 6: ఈవారం జైలుకి వెళ్లిందెవరో..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో మూడో వారం కెప్టెన్సీ టాస్క్ రసాభాసగా ముగిసింది. శ్రీసత్య, ఆదిరెడ్డి, శ్రీహన్ లు ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు. మూడో వారానికిగాను ఆదిరెడ్డి కెప్టెన్ అయినట్లుగా  తెలుస్తుంది. ఇక ఈ వారం ఎవరు ఎంత ఫుటేజ్ ఆడియన్స్ కి ఇచ్చారో అనే విషయంలో ఎవరికి వారే మేము ఇన్ని నిముషాలు ఇచ్చాం, అన్ని నిముషాలు ఇచ్చామంటూ చెప్పారు. రోహిత్-మరీనా లు మేము రొమాన్స్, గిల్లికజ్జాలు అంటూ 5 నిముషాలు అంటూ చెప్పుకున్నారు. గీతు నేను ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను అంది. ఆరోహి కూడా నేను గొడవలు కోట్లకు గట్టిగానే పోరాడాను, ఆడియన్స్ కి నచ్చే ఉంటుంది అంది. 

ఇక శ్రీ సత్య నేను ఈవారం బాగా పెరఫామ్ చేశా అంది. రేవంత్ అయితే ఇప్పటివరకు నాకొచ్చిన నామినేషన్స్ ఎవరికీ రాలేదు.. సో నేను ఏదో విధంగా హైలెట్ అవుతున్నా అన్నాడు. దానితో గీతు రేవంత్ అన్న గత రెండు రోజులుగా నిద్ర పోతూనే ఉన్నాడు కుక్కలు మొరుగుతూనే ఉన్నాయ్ అంది. నేను ఒక్కసారే పడుకున్నా, ఒక్కసారే కుక్కలు మొరిగాయి అన్నాడు. కాదు మేము నిన్ను లేపుతూనే ఉన్నామంది గీతు. ఇక అందరూ అయ్యాక జీరో టాగ్ మీ ముగ్గురికి అంటూ అది రెడ్డి అర్జున్ కళ్యాణ్ కి, కీర్తి కి, ఆరోహి కి వెయ్యగా.. మీ ముగ్గురిలో మీరే చర్చించుకుని జైలుకెవరు వెళ్లాలో  ఆలోచించుకోమని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ వారం ఆరోహి జైలుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. కీర్తికి జీరో టాగ్ ఇచ్చినందుకు ఫీలవగా.. అర్జున్ నేనేం ఆడనో ఆడియన్స్ చూసుకుంటారు అన్నాడు.

 

Bigg Boss 6: Today Promo viral:

Bigg Boss 6: New Promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ