ఇటీవలే ఫ్యామిలీ లో జరిగిన దురదృష్టకర ఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రభాస్ శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ నిర్వహించి నిన్న గురువారం నుండే ప్రభాస్ మళ్ళీ షూటింగ్స్ కి హాజరవుతున్నారు. అయితే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ఆదిపురుష్ అవుట్ లుక్ దసరాకి చూస్తామని ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆమేరకు ఆదిపురుష్ నుండి రేపు అధికారిక ప్రకటన రాబోతుంది అని తెలుస్తుంది.
ఫాన్స్ ఆత్రుతకి తెరదించుతూ ఈ ప్రకటన ఉండబోతుంది అని, ఆదిపురుష్ గా రాముడి లుక్ లో ప్రభాస్ రావడం పక్కా అంటున్నారు. దానికి సంబందించిన ఏ అప్ డేట్ వచ్చినా ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడం ఖాయం. మరి మనము ఆదిపురుష్ అప్ డేట్ వస్తుందని ఆశిద్దాం, రావాలని కోరుకుందాం. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మాత్రం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల నుండి చాలా సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయి అని చాలా స్ట్రాంగ్ గా తెలుస్తుంది.