బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తమిళ డైరెక్టర్ అట్లీ తో జవాన్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ లో నయనతార హీరోయిన్ గా నటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు షారుఖ్-అట్లీ తో పాటుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫాన్స్ ఆనంద్ పడడమే కాదు, కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్లి జవాన్ ప్రాజెక్ట్ లో విజయ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేసారు.
అట్లీ షేర్ చేసిన విజయ్-షారుఖ్ ల పిక్ ఇంతటి అనుమానాల్ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. అయితే ఆ పిక్ క్యాజువల్ గా దిగిందా.. లేదంటే విజయ్ జవాన్ లో నిజంగానే క్యామియో చేస్తున్నారా అనే విషయం పక్కనబెడితే.. విజయ్ యాంటీ ఫాన్స్.. విజయ్ పై దారుణంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. #CameoBeggarVijay అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే విజయ్ షారుఖ్ జవాన్ లో ఎలాంటి గెస్ట్ రోల్ చెయ్యడం లేదని, జస్ట్ జవాన్ సెట్స్ లో అట్లీ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ తో షారుఖ్, అట్లీ దిగిన పిక్ అది అని తెలుస్తుంది.