హైదరాబాద్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ని మించిన స్టూడియో ని రామోజీ రావు సిటీ చివార్లలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో భారీగా సెట్స్ నిర్మించి షూటింగ్స్ చేసుకుంటూ ఉంటారు మేకర్స్, తమిళ హీరోలు రజినీకాంత్ లాంటి వాళ్ళే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. మొన్నామధ్యన మెగాస్టార్ వైజాగ్ లో మెగా స్టూడియో ప్లాన్ చేస్తున్నారని అన్నప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు. ఈలోపు అల్లు వారు తమ స్టూడియోని పెద్ద రేంజ్ లో మొదలు పెట్టారు. అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని సువిశాలమైన స్థలంలో అల్లు స్టూడియోస్ కు శ్రీకారం చుట్టారు. కోవిడ్ కి ముందే అల్లు స్టూడియో కి శంకుస్థాపన చేసిన అల్లు ఫ్యామిలీ.. స్టూడియో నిర్మాణాన్ని చాలా తొందరగానే పూర్తి చేసేసింది.
అక్కడ న్యూ టెక్నలాజితో అన్ని వసతులతో సినిమాలకు అలాగే వెబ్ సిరీస్ లకు అనువుగా వుండే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సంబందించిన పనులకి కూడా ఈ స్టూడియో ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం చాలావరకు పూర్తయిన అల్లు స్టూడియో ని అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్యగారి జయంతి రోజున ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ స్టూడియో ఓపినింగ్ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరు దంపతులు, అల్లు ఫ్యామిలిలో అల్లు అర్జున్, శిరీష్, అరవింద్ కుటుంబ సభ్యులు పాల్గొంటారని.. ఇక్కడ ఈ స్టూడియో మొదలైన తర్వాత మొదటగా పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఈ స్టూడియోలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.