గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన శాకుంతలం షూటింగ్ కంప్లీట్ అయ్యి ఏడాది గడిచిపోయింది. ఈ చిత్రంలో మేజర్ పార్ట్ గ్రాఫిక్స్ వర్క్ కి చోటివ్వడంతో షూటింగ్ కంప్లీట్ అయిన ఏడాదికి గాను సినిమాకి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. శాకుంతలం గా సమంత లుక్ ని ఎప్పుడో వదిలిన మేకర్స్ ఈ మధ్యనే దేవ్ దుశ్యంత్ లుక్ ని రివీల్ చేసారు. ఇక శాకుంతలం షూటింగ్ ఫినిష్ అవడంతో సమంత కూడా తన తదుపరి ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యింది. ఈమధ్యన శాకుంతలం జాడ తెలియడం లేదు అంటూ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు గుణశేఖర్ బ్యాచ్ చెక్ పెట్టింది.
అందులో భాగమే శాకుంతలం నుండి బిగ్ అప్ డేట్ అంటూ నిన్న గురువారమే హైప్ క్రియేట్ చేసి.. ఈ రోజు శుక్రవారం ఆ అప్ డేట్ ఏమిటో రివీల్ చేసారు. శాకుంతలం నవంబర్ 4 న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. శాకుంతలం కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.
ఇటీవల శాకుంతలం సినిమా ఫస్ట్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రిలీజ్ డేట్ తో పాటుగా సమంత-దేవ్ ల రొమాంటిక్ పోస్టర్ ని వదిలారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటించింది.