Advertisementt

బిగ్ బాస్ 6: ఏంటి ఈ పిట్ట పంచాయితీ

Fri 23rd Sep 2022 10:09 AM
bigg boss6,inaya,srihan  బిగ్ బాస్ 6: ఏంటి ఈ పిట్ట పంచాయితీ
Bigg Boss 6: Srihan vs Inaya Sulthana బిగ్ బాస్ 6: ఏంటి ఈ పిట్ట పంచాయితీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మూడోవారంలో కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు ఎక్కువయ్యాయి. ఆ ఇనాయ సుల్తానా అరుపులకి ప్రేక్షకులు కూడా భయపడిపోతున్నారు. ఆ అమ్మాయి నోరు తెరిచింది అంటే చాలు హౌస్ మేట్స్ మత్రమే కాదు, ఆడియన్స్ కూడా బెదిరిపోతున్నారు. ఇప్పటి వరకు గీతూనే అనుకుంటే ఇనాయ కూడా అర్ధం పర్ధం లేని లాజిక్స్ తో గొడవపడిపోతుంది. ఆ అమ్మాయి మొదటి వారమే బయటికి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ రెండో వారంలో అటు టాస్క్ వైజ్ గా ఇటు వాయిస్ పరంగాను హైలెట్ అయ్యింది. నిన్న కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఆమెని కిడ్నాప్ చేయబోయిన నేహాని, ఆరోహిని కాలితో తన్నిపడేసింది. అంతకు ముందే శ్రీహన్ ని అరే వరే అన్నందుకు రేవంత్ కూడా గొడవపడ్డాడు. 

ఇక నిన్న కెప్టెన్సీ కంటెండర్లు గా నిలిచిన ఫైమా, శ్రీహన్, గీతు, శ్రీసత్య, ఆది రెడ్డిలతో గీతు ఫస్ట్ టాస్క్ కే డిస్ క్వాలిఫై అయ్యింది. తర్వాత రౌండ్ లో ఫైమా చేతులు తో బ్రిక్స్ జరిపిన కారణంగా రేవంత్ ఆమెని వారించాడు. అయినప్పటికీ.. ఫైమా గేమ్ కంటిన్యూ చేసింది. తర్వాత రేవంత్ బిగ్ బాస్ కి చెప్పి మరీ ఫైమా ని డిస్ క్వాలిఫై చేసేసాడు. తర్వాత శ్రీహన్ కూడా బ్రిక్స్ ముట్టుకున్నాడని అనగానే ఎవరైనా చూసారా అని రేవంత్ అడిగాడు. దానితో ఇనాయ వచ్చేసి నేను చూసాను, శ్రీహన్ ముట్టుకోవడం అంటూ చెబుతుంది. ఏ పిట్ట నీ దగ్గరికి వచ్చి ఏం కూసిన సంచాలక్ గా నీ నిర్ణయం నువ్ తీసుకో అంటూ శ్రీహన్ రేవంత్ కి చెప్పడంతో.. నన్ను పిట్టా అంటావా అంటూ ఇనాయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నేను నిన్ను కాదు పిట్ట అన్నది అని శ్రీహన్ చెప్పినా, గీతు నన్నే శ్రీహన్ పిట్ట అన్నాడు, పిట్టా అంటే బ్యూటిఫుల్ వర్డ్ అని చెప్పినా ఆమె వినలేదు.. సరికదా శ్రీహన్ వెంటపడుతూ.. ఇల్లంతా తిరుగుతూ నిన్ను వాడు అని ఒప్పుకోనివాడివి నన్ను పిట్ట అని ఎలా అంటావ్.. మగాడివేనా? అని ఏదో మాట జారుతుంది ఇనయ.. ఎవరు చెప్పినా ఇనాయ ఆపలేదు, శ్రీహన్ కూడా ఆమెకి దొరక్కుండా పారిపోతూనే ఉన్నాడు. దానితో ఏంటి మాకు ఈ పిట్ట పంచాయితీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss 6: Srihan vs Inaya Sulthana:

Bigg Boss 6 telugu: Yesterday Episode Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ