Advertisementt

ఈరోజు సినిమాల రిలీజ్ సంగతి చూసేద్దాం

Fri 23rd Sep 2022 09:21 AM
krishna vrinda vihari,dongalunnaru jagratta,alluri  ఈరోజు సినిమాల రిలీజ్ సంగతి చూసేద్దాం
Krishna Vrinda Vihari, Dongalunnaru Jagratta, Alluri relasing on September 23 ఈరోజు సినిమాల రిలీజ్ సంగతి చూసేద్దాం
Advertisement
Ads by CJ

గత శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకినీ ఢాకిని, నేను మీకు బాగా కావల్సిన వాడిని.. ఈ సినిమాలేవీ ప్రేక్షకులని ప్రభావితం చేయలేకపోయాయి. దానితో ఈ వారం విడుదలవుతున్న చిత్రాలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కనిపించింది. కారణం నాగ శౌర్య తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు పాద యాత్ర పేరుతో కృష్ణ వ్రింద విహారి ప్రమోషన్స్ చేసాడు. అలాగే శ్రీ విష్ణు కూడా అల్లూరి తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మత్తు వదలరా ఫేమ్ సింహ కోడూరి కూడా ఈ రోజే దొంగలున్నారు జాగ్రత్త చిత్రం తో అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. 

ఈ మూడు సినిమాల్లో అంతో ఇంతో బజ్ ఉన్న చిత్రం నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి. బ్రాహ్మణ యువకుడిగా నాగ శౌర్య చేసిన కేరెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అంచనాలు పెంచింది. ఇక శ్రీ విష్ణు అల్లూరి. అయితే శ్రీవిష్ణు గత సినిమాల రిలీజ్ లో కనబడిన సందడి అల్లూరి విడుదల సమయంలో కనిపించలేదు. అంతేకాకుండా అల్లూరి కి అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక మూడోది శ్రీ సింహ కోడూరి దొంగలున్నారు జాగ్రత్త. మూడూ మూడు డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కిన చిత్రాలు. అలాగే ఓటిటి నుండి హాట్ స్టార్ లో లైగర్ చిత్రం వచ్చేసింది. దీనితో పాటుగా మరికొన్ని చిన్న చిత్రాలు ఈరోజే విడుదలవుతున్నాయి.

ఈ రోజు శుక్రవారం ముఖ్యంగా కృష్ణ వ్రింద విహారి, అల్లూరి, దొంగలున్నారు జాగ్రత్త మూడు చిత్రాల ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారు.. ఎవరు సైలెంట్ అవుతారో అనేది మరోకాసేపట్లో..

Krishna Vrinda Vihari, Dongalunnaru Jagratta, Alluri relasing on September 23:

Sep 23 releases: KVV, Dongalunnaru Jagratta, Alluri and many more

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ