బిగ్ బాస్ లో గత సీజన్ లో లవ్ ట్రాక్ లు నడిచాయి. అందులో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి ల ట్రాక్ హైలెట్ అవ్వగా.. తర్వాత సీజన్ లో అఖిల్-మోనాల్ గజ్జర్ ట్రాక్ అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. వాళ్ళ లవ్ ట్రాక్ వలనే ఆ సీజన్ కి బాగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ అంటూ సిరి-షణ్ముఖ్ ల హగ్గులు, ముద్దులు మితిమీరిపోయాయి. బుల్లితెర ప్రేక్షకులకే వారు చిరాకు తెప్పించారు. అంతలా హగ్గులతో చెలరేగిపోయారు. ఇక ఈ సీజన్ లో అలాంటి లవ్ ట్రాక్ ఇంకా మొదలు కాకపోయినా.. శ్రీ సత్య మీద అర్జున్ కళ్యాణ్ ఇష్టం చూపిస్తున్నాడు. గత వారం నాగ్ ఎపిసోడ్ లో ఒక అమ్మాయిని బౌన్సర్ గా చేసుకోమంటే.. శ్రీ సత్య అని అర్జున్ అనగానే బయట బుల్లితెర ప్రేక్షకులు, లోపల హౌస్ మేట్స్ అందరూ అరిచేసారు. సం థింగ్ సం థింగ్ అన్నారు. కానీ మాది ఫ్రెండ్ షిప్ మాత్రమే అన్నాడు అర్జున్ కళ్యాణ్.
అయినప్పటికీ శ్రీ సత్య మీద ప్రేమతో కనిపిస్తున్నాడు. ఆమె మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం అటుంచి.. నాకు అందరూ అన్నయ్యలు అంటూ బిహేవ్ చేస్తుంది. ఆమె గ్లామర్ గా, అందంగా కనిపిస్తుంది. స్ట్రయిట్ ఫార్వార్డ్ అమ్మాయి. హౌస్ లో మొదటి వారం లోనే శ్రీ సత్య తనకి లవ్ బ్రేకప్ అయ్యింది అని, తనని మోసం చేసాడని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో తాజాగా వదిలింది స్టార్ మా. అందులో నేహా చౌదరి-శ్రీహన్ లు మాట్లాడుకుంటూ సత్య మీద అర్జున్ కి ఫీలింగ్స్ ఉన్నాయని శ్రీహన్ చెప్పగా.. అర్జున్ కళ్యాణ్ కి శ్రీ సత్య అంటే చాలా ఇష్టమని, ఆమె ఎమన్నా ఆహా, వావ్, సూపర్ అంటూ భజన చేస్తాడని నేహా అంది. రేవంత్-శ్రీ సత్య-అర్జున్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను అందరిని అన్నయ్య అనిపిలుస్తాను, ఎవరైనా యాక్సప్ట్ చెయ్యడం, చెయ్యకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అంది. దానికి అర్జున్ కూడా వావ్ అంటూ కాస్త వెటకారంగా ఎక్స్ ప్రెషన్ పెట్టాడు.