Advertisementt

ఇండియన్ 2 సెట్స్ లో కమల్-శంకర్

Thu 22nd Sep 2022 11:13 AM
indian2,kamal haasan,shankar  ఇండియన్ 2 సెట్స్ లో కమల్-శంకర్
Indian2 Shooting Resumes ఇండియన్ 2 సెట్స్ లో కమల్-శంకర్
Advertisement
Ads by CJ

భారతీయుడు 2 ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టినప్పటికీ.. కొంతమేర షూటింగ్ చేసిన తర్వాత సెట్స్ లో జరిగిన ఓ భారీ యాక్సిడెంట్ వలన షూటింగ్ ఆపేసారు. మళ్లీ రెండేళ్ళకి భారతీయుడు 2 అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్ళింది. ఈ నెల మొదటి వారంలోనే షూట్ రెస్యూమ్స్ అంటూ హడావిడి చేసారు. శంకర్ అయితే RC15, భారతీయుడు 2 షూటింగ్స్ చేస్తూ రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు. ఇక కాజల్ తో పాటుగా రకుల్ ప్రీత్ కూడా భారతీయుడు 2 షూటింగ్స్ కి రెడీ అయ్యారు. ఇక కమల్ కూడా విక్రమ్ తర్వాత అమెరికాకి వెళ్లొచ్చి భారతీయుడు లుక్ లోకి మేకోవర్ అయ్యారు.

తాజాగా భారతీయుడు సెట్స్ నుండి దర్శకుడు శంకర్ కమల్ హాసన్ కి సీన్స్ ఎక్స్ ప్లయిన్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కమల్ హాసన్ భారతీయుడు లుక్ లో కనిపిస్తున్నారు. హెయిర్ వెనక్కి దువ్వి మీసాలు మెలేసి కనిపిస్తున్నారు. కమల్ హాసన్ తో శంకర్ మూవీ మళ్లీ మొదలు అనగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చెన్నై లోనే మొదలైన ఈ షెడ్యూల్ ఓ 10 రోజులపాటు సాగనుంది అని తెలుస్తుంది.

Indian2 Shooting Resumes:

Indian2 Shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ