Advertisementt

బిగ్ బాస్ 6: రచ్చ రచ్చే

Thu 22nd Sep 2022 10:24 AM
bigg boss 6,inaya,revanth  బిగ్ బాస్ 6: రచ్చ రచ్చే
Bigg Boss 6: Housemates vs Revanth బిగ్ బాస్ 6: రచ్చ రచ్చే
Advertisement
Ads by CJ

నాగార్జున కోపం, ఆయనిచ్చిన క్లాస్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై బాగా పని చేసినట్టే కనిపిస్తుంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ రెచ్చిపోయి కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడేస్తున్నారు. కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి అరుస్తూ.. హౌస్ మొత్తం రచ్చ రచ్చ చేస్తూ ఓ యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇనాయ అయితే గట్టిగా అరుస్తూనే కనిపిస్తుంది. వన్ అవర్ ఎపిసోడ్ లో ఇనాయ అరుపులకి బుల్లితెర ప్రేక్షకులే బెదిరిపోతున్నారు. గత రాత్రి ఎపిసోడ్ లో ఇనాయ ని ఇద్దరు దొంగలు కిడ్నాప్ చేసే విషయంలో ఆమెని చాలామంది పట్టుకుని కిడ్నాప్ చెయ్యడానికి ట్రై చెయ్యగా.. ఇనాయ నేహా మొహం మీద తన్నడం, ఆరోహని కాలితో తన్నడం చెయ్యడంతో అక్కడ గొడవ గట్టిగా స్టార్ట్ అయ్యింది. 

నేహా రేవంత్ తో చెప్పుకుని ఫీలైంది. రేవంత్ కూడా ఇనాయపై గొడవకి దిగాడు. తర్వాత ఇదే గొడవలో కీర్తి-ఇనాయ లు ఫైట్ చేసుకున్నారు. ఇక రేవంత్ ని తన టీమ్ సభ్యులే మోసం చేసారు. గీతూ తో బేరాలాడుతున్నాడనుకుని రేవంత్ బొమ్మలని నేహా, ఆరోహి లు దొబ్బేసారు. తన బొమ్మలు పోవడం చూసిన రేవంత్ కోపంతో ఊగిపోయాడు. నా బొమ్మలు తీసినోళ్లకి సిగ్గుసరం లేదు అంటూ ఊగిపోయాడు. అంతేకాదు.. దొంగలు ఎలా గెలుస్తారో చూస్తా అంటూ.. ఈరోజు నైట్ నిద్ర పోను పోలీస్ లని గెలిపిస్తా అంటూ శపధం చేసాడు. రేవంత్ ని ఓడించాలనే ప్రయత్నం హౌస్ లో గట్టిగానే జరిగింది. ఇక గీతూ నేనెవరిని కన్సిడర్ చెయ్యను, నేనెవ్వరి మాట వినను అంటూ ఎప్పటిలాగే తన స్ట్రాటజీ తాను ప్లే చేసింది. మరి ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్లు గా ఎవరు నిలుస్తారో చూడాలి.

Bigg Boss 6: Housemates vs Revanth:

Bigg Boss 6: Yesterday episode highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ