పొలిటికల్ లీడర్, మాజీ మంత్రి, సినీ నటులు కృష్ణ రాజు గారు అకాలమరణంతో ఆయన కుటుంబ సభ్యులే కాదు, కృష్ణం రాజుగారి అభిమానులు ఎంతో కుంగిపోయారు. ఆయన ఆఖరి చూపు కోసం కృష్ణం రాజుగారి నివాసానికి, అంత్యక్రియలు జరిగిన కనకమామిడి ఫామ్ హౌస్ కి తరలి వచ్చారు. ఆయన పెద్ద కర్మ జరిగిన 11 వ రోజు కూడా పెద్ద ఎత్తున కృష్ణం రాజుగారి అభిమానులు ఆయన నివాసానికి వచ్చారు, వుడయార్ ఫైన్‌ఆర్ట్స్ వారు ఆయన మీద ఎంతో అభిమానంతో తయారుచేసిన కృష్ణంరాజు శిల్పాన్ని ఆయన నివాసంలో ఆవిష్కరించారు.
ఈరోజు కృష్ణ రాజు గారి పెద్ద ఖర్మ కావటంతో ప్రభాస్ తో పాటుగా, ఆయన కుటుంబ సభ్యులు కృష్ణం రాజుగారిని తలుచుకుని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే కృష్ణం రాజుగారి అభిమానులకి ప్రభాస్ ప్రత్యేకించి భోజన ఏర్పాట్లు చేసారని తెలుస్తుంది. అయితే ఈనెల 29 న కృష్ణం రాజు గారు పుట్టిన ఊరు మొఘల్తూరులో కృష్ణం రాజుగారికి వేలాదిమంది అభిమానుల సమక్షంలో సంస్కరణ సభ జరుగుతుంది అని, ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ మొఘల్తూరుకి వెళ్లనున్నారని, అక్కడ ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని కృష్ణరాజుగారి కుటుంబ సభ్యులు తెలిపారు.