మహేష్ బాబు నాలుగు నెలల గ్యాప్ తో త్రివిక్రమ్ తో SSMB28 షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్ మొదలు పెట్టిన వారానికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అంటూ అప్ డేట్ ఇవ్వడం, తదుపరి కొత్త షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ చెప్పడంతో.. మహేష్ బాబు-త్రివిక్రమ్ ఇంత ఫాస్ట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చెయ్యడమే.. అది ప్రేక్షకులకే కాదు ఫాన్స్ కి మాములు షాక్ కాదు. ఎందుకంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరూ చాలా స్లోగా పని చేసే వ్యక్తులు. షూటింగ్ కూడా నెమ్మదిగానే సాగుతుంది. అలాంటిది వారం రోజుల్లోనే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చెయ్యడం వెనుక ఓ వార్త బయటికి వచ్చింది.
అది SSMB28 ఫస్ట్ షెడ్యూల్ యాక్షన్ పార్ట్ తో మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మహెష్ బాబు పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు త్రివిక్రమ్. అయితే ఆ యాక్షన్ పార్ట్ ఎపిసోడ్ అనుకున్నట్లుగా రాకపోవడం వలనే ఈ షెడ్యూల్ త్వరగా ముగించేశారని, మహేష్ ఈ షెడ్యూల్ పై అసంతృప్తిగా ఉండడంతో త్రివిక్రమ్ మళ్లీ రీ షూట్ చేరుద్దామని చెప్పడంతో.. ఈ షెడ్యూల్ ని మధ్యలోనే ఆపేశారని తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో దసరా పూర్తికాగానే కొత్త షెడ్యూల్ మొదలు పెడతారని మేకర్స్ అప్ డేట్ కూడా ఇచ్చారు.