రామ్ చరణ్ ప్రస్తుతం అంత బిజీగా లేరు. కారణం ఆయన శంకర్ తో చేస్తున్న మల్టీ లాంగ్వేజెస్ మూవీ RC 15 షూటింగ్ కి గ్యాప్ లు మీద గ్యాప్ లు వస్తున్నాయి. ఎందుకంటే దర్శకుడు శంకర్ RC15 షూటింగ్ తో పాటుగా ఇండియన్ 2 షూటింగ్ కూడా చేస్తుండడంతో రామ్ చరణ్ కి ఫ్రీ టైం దొరుకుతుంది. ఈ గ్యాప్ ఆయన లో రిలాక్స్ అవుతున్నారు. మొన్న RC15 షూటింగ్ కి బ్రేక్ రాగానే చెల్లెళ్ళు, మేనకోడలు, ఫ్రెండ్స్ తో కలిసి ఊటీ కి వెకేషన్స్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసారు. ఆ వెకేషన్స్ కి భర్య ఉపాసన మిస్ అయ్యింది.
ఊటీ నుండి రాగానే రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి మరో ట్రిప్ వేశారు. పెళ్లి రోజునాడు వెకేషన్స్ కి వెళ్ళిన చరణ్ -ఉపాసన ఇప్పుడొక షార్ట్ ట్రిప్ వేసి తిరిగి హైదరాబాద్ కి చేరుకోవడంతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్- ఉపాసనలను ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించారు. రామ్ చరణ్ తో పాటుగా ఆయన పెంపుడు పెట్ రైమా కూడా ఉంది. చరణ్-ఉపాసన ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవ్వగా.. అప్పుడు చెల్లెళ్ళతో-ఇప్పుడు వైఫ్ తో రామ్ చరణ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటున్నారు.