సమంత తరచూ హెల్త్ ఇష్యుస్ మీదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత స్కిన్ ఎలెర్జితో సఫర్ అవుతున్న కారణం గానే ఆమె మీడియాకి దూరంగా ఉంటుంది అని, ఆమె నటించిన యశోద, శాకుంతలం మూవీస్ షూటింగ్ కంప్లీట్ కూడా అవడంతో సమంత అటు షూటింగ్స్ లోను పాల్గొనడం లేదని, విజయ్ దేవరకొండ తొందరపడుతున్నా.. సమంత ఖుషి సెట్స్ లోకి వెళ్లలేకపోతుంది అని, ప్రస్తుతం సమంత అమెరికాకి ప్రయాణమయ్యింది అని, అక్కడే ఆమె కొద్దీ రోజుల పాటు స్కిన్ ఎలెర్జికి ట్రీట్మెంట్ తీసుకోబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాని కమ్మేసాయి.
మీడియా, వెబ్ మీడియా, సోషల్ మీడియా అన్నటిలో సమంత హెల్త్ న్యూస్ లే కనిపిస్తున్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలోనూ సమంత స్పందించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా సమంత మేనేజర్ సమంత హెల్త్ ఇష్యుస్ పై స్పందించాడు. ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆమె ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పిన మేనేజర్ ఆమె అమెరికా ప్రయాణం విషయం మాత్రం బయటపెట్టలేదు.