ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha gave a green signal for second marriage

సామ్ 2వ పెళ్లికి, సద్గురుకి సంబంధమేంటి?

Samantha gave a green signal for second marriage

సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ అంశంపై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే సమంతకి ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకపోయినా.. ఆమె స్ర్పిచ్యువల్ గురు సద్గురు.. ఆమెకు రెండో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన.. సమంతను రెండో పెళ్లికి ఒప్పించాడని కూడా టాక్ నడుస్తుంది. అంతేకాదు, పెళ్లి కొడుకుని చూసే బాధ్యత కూడా తనే తీసుకున్నాడని, ప్రస్తుతం ఆ ప్రయత్నాలు కూడా ముగిశాయనేలా టాక్ బీభత్సంగా వైరలవుతోంది. 

 

మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది కానీ.. నిజంగా ఇప్పుడామె రెండో పెళ్లి చేసుకునేంత ఫ్రీగా ఉందా? అనే దానిపై అనుమానాలు రాక మానవు. కెరీర్‌పై దృష్టి పెట్టి.. బాలీవుడ్, హాలీవుడ్‌లో ఎడాపెడా సినిమాలు చేయాలనే కసితో ఉన్న సమంతను.. సద్గురు ఎలా మార్చేసి ఉంటాడు? నిజంగా సద్గురు చెబితే సమంత పెళ్లి చేసుకుంటుందా? అనే అనుమానాలు తీరాలంటే.. సమంత క్లారిటీ ఇవ్వాల్సిందే. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు పుట్టించేవారికి.. మరోసారి ఆమె క్లాస్ తీసుకోవాల్సిందే. అప్పటి వరకు ఇలాంటి వార్తలు పుడుతూనే ఉంటాయ్ మరి. 

Samantha Guru convinces her for second marriage

samantha
sadguru
second marriage
naga chaitanya
samantha marriage