బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయ్యి కూడా ఏడెనిమిది నెలలు గడిచేయిపోయాయి. హాలీవుడ్ రేంజ్ లో విడుదల చేసేందుకు దర్శకుడు ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిపురుష్ ఆరంభమై రెండేళ్లు గడిచిపోతున్నా.. ఇంతవరకు ఆ సినిమా లో ప్రభాస్ రామ లుక్ ని విడుదల చెయ్యలేదు. ఆ లుక్ పై ఎలాంటి ఇన్ ఫార్మేషన్ బయట పెట్టలేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ అప్ డేట్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చెయ్యడమే కాదు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేసినా.. ఓం రౌత్ వాటిని షేర్ చేస్తున్నాడు కానీ.. ఆదిపురుష్ లుక్ వదలకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తూనే ఉన్నాడు.
అయితే ఈమధ్యన కొద్ది రోజులుగా దసరా కి ఆదిపురుష్ నుండి ప్రభాస్ రాముడి లుక్ పక్కా అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. ప్రభాస్ కి ఢిల్లీ రామ్ లీల మైదాన్ లో జరగబోయే రావణదహన కార్యక్రమానికి అతిధిగా పాల్గొమని పిలుపొచ్చింది.. సో దసరాకి ఆదిపురుష్ లుక్ ఆగమనం అంటూ ఆత్రుత పడుతున్నారు ప్రభాస్ ఫాన్స్. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ బర్త్ డే వరకు ఆదిపురుష్ నుండి ఎలాంటి అప్ డేట్ కానీ, లుక్ కానీ విడుదలయ్యే అవకాశం లేదని, అక్టోబర్ 23 నే ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఆదిపురుష్ అప్ డేట్స్ రివీల్ చేసే యోచనలో టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానితో ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు.