ఈ నెల బాక్సాఫీసు కాస్త డల్ గానే ఉంది అని చెప్పాలి. గత నెల కార్తికేయ 2 హిట్ తర్వాత ఈ నెలలో రెండు వారాలు బాక్సాఫీసు దగ్గర కళ కనిపించలేదు. ఎంతో హైప్ తో వచ్చిన లైగర్ ప్లాప్ ప్రేక్షకులని బాగా నిరాశపరించింది. ఆ తర్వాత వారాలు కూడా చిన్న సినిమాలు రిలీజ్ అయినా అవి ప్రేక్షకులని అంతగా ప్రభావితం చేయలేకపోయాయి. శర్వానంద్ ఒకే ఒక జీవితం ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసింది. ఆ సినిమా తర్వాత గత వారం వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, శాకినీ ఢాకిని బోల్తా కొట్టాయి. ఇక ఈ వారం ముక్కోణపు పోటీ అయినప్పటికీ.. ప్రధానంగా అల్లూరి మాస్ మూవీ vs కృష్ణ వ్రింద విహారి క్లాస్ మూవీ అన్న రేంజ్ లో ప్రమోషన్స్ ఉన్నాయి.
ఇక సింహ కోడూరి దొంగలున్నారు జాగ్రత్త కూడా ఈ వారమే రిలీజ్ కి రెడీ అయ్యింది. శ్రీ విష్ణు నటించిన అల్లూరి మాస్ మూవీ గా తెరకెక్కినది. అందుకు తగ్గ ప్రమోషన్స్ తో టీం హడావిడి చేస్తుంటే, కృష్ణ వ్రింద విహారి అంటూ నాగ శౌర్య పాదయాత్ర చేసి వచ్చాడు. సినిమా ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి బాగా కష్టపడుతున్నాడు. నాగ శౌర్య కి ఈ సినిమా హిట్ కంపల్సరీ. అటు శ్రీవిష్ణుకి కూడా అల్లూరితో ఖచ్చితంగా హిట్ కొట్టాలి. మరి క్లాస్ vs మాస్ లో ఏ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో ఈ శుక్రవారం తేలిపోతుంది. వీటితో పాటుగా ఈ వారం ఓటిటిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ లైగర్ నెల తిరక్కుండానే ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.