బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంటరయిన కొంతమంది ఫేమ్ కోసం, క్రేజ్ కోసం తెగ తహతహలాడిపోతున్నారు. అందులో ఓ పది మంది దాక ఉన్నారు. అటు టాస్క్ పెరఫార్మెన్స్ లోను, ఇటు గొడవలు పడే విషయంలోనూ టాప్ లోనే ఉంటున్నారు. మిగతా వారు చాలా సైలెంట్ గా గేమ్ మీద కూడా ఫోకస్ పెట్టకుండా గడిపేస్తున్నారు. దానితో బిగ్ బాస్ నాగార్జున చేత ఇలా ఆడకుండా ఉంటే ఇంటికెళ్లిపొండి, తిన్నామా, పండామా అంటే కుదరదు ఆడాలి అంటూ గత శనివారం గట్టిగా క్లాస్ పీకారు. ఆ ఎఫెక్ట్ సోమవారం నామినేషన్స్ అప్పుడే కనిపించింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ వాయిస్ రేజ్ చేసి కనిపించారు. అందులో శ్రీ సత్య, వాసంతి, కీర్తి ఉన్నారు. నామినేషన్స్ అప్పుడు గట్టిగా గొడవ పడ్డారు.
ఇక మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో అయితే దొంగలు, పోలీస్ ల ముఠాలో ఆట కన్నా ముందు అరవడం, కొట్టు కోవడం పైనే హౌస్ మేట్స్ ఫోకస్ పెట్టారు. శ్రీహన్-ఇనాయ అయితే కొట్టుకునే వరకు వచ్చారు. వాడు వీడు అంటావా అంటూ రేవంత్ కూడా ఇనయపై రెచ్చిపోయాడు. తర్వాత నేహా చౌదరి కాలు బాలాదిత్య గట్టిగా పట్టుకున్నాడు దానితో ఆమెకి దెబ్బ తగిలింది ఆమె కూడా అరుపులు. సూర్య నేను జెన్యూన్ గా గేమ్ ఆడుతున్నా అన్నాడు. మధ్యలో గలాటా గీతూ అయితే దొంగతనం మొదలు పెట్టింది. ఆది రెడ్డి బేరం ఆడినా పని జరగలేదు. ఇక హౌస్ మేట్స్ టాస్క్ కన్నా గొడవలు, కొట్లాటలు చూసిన వారు ఇది అసలు బిగ్ బాసా.. చేపల మర్కెట్టా అంటూ కామెంట్ చేస్తున్నారు.