Advertisementt

తారక్ టెర్రిఫిక్ ప్లాన్

Tue 20th Sep 2022 09:34 PM
jr. ntr,ntr 30,koratala  తారక్ టెర్రిఫిక్ ప్లాన్
Tarak Terrific Plan తారక్ టెర్రిఫిక్ ప్లాన్
Advertisement
Ads by CJ

టెంపర్ సినిమా నుండి అలోచించి అడుగు వేస్తున్నాడు తారక్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జై లవకుశ, జనతా గ్యారేజ్, అరవింద్ సమేత ఇలా ఆచి తూచి అడుగులు వేస్తూ, ఏరి కోరి సబ్జెక్టు లు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్న తారక్ ట్రిపుల్ ఆర్ తర్వాత గ్యాప్ ఇచ్చాడు. ఫాన్స్ అంతా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎప్పుడూ.. ఎప్పుడు, ఎవరితో, ఎలా ఉండబోతుంది అనే యాంగ్జైటీ తో ఉంటే.. తారక్ మాత్రం తొందరపడే స్థితిలో లేదు. చాలా కాలిక్యులేటెడ్ గా తన కెరీర్ మలుచుకునే స్థితికి వచ్చేసాడు.

ఇక మీదట తారక్ నుండి రాబోయే సినిమాలన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండబోతున్నాయి. అందుకే కొరటాల ముందు చెప్పిన కథని కాదని, కొరటాల చేతే తనకి సూట్ అయ్యే, ఇప్పుడు తన మీద పడాల్సిన కథని రాయించుకున్నాడు. అలాంటి సినిమా తోనే రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా అలాంటి సినిమానే. ఈ రెండే కాకుండా ఒక బడా బాలీవుడ్ డైరెక్టర్ తారక్ తలుపు తట్టాడు. కథ విన్న తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానికి కూడా భారీ రేంజ్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తొందరలోనే బయటికి వస్తాయి. తారక్ గ్యాప్ ఇచ్చాడని ఫీలవ్వొద్దు ఫాన్స్.. తారక్ స్ట్రోక్ చూస్తారు తొందర్లోనే.. 

Tarak Terrific Plan:

Jr. Ntr Upcoming Movies update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ