విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంతో హిట్ అవుతుంది అని బల్లగుద్ది చెప్పిన ఆయన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్ విజయ్ నమ్మకాన్ని నిలబెట్టలేదు సరికదా.. విజయ్ యాటిట్యూడ్ ని ప్రశ్నించేలా చేసింది. విజయ్ దేవరకొండని వేలెత్తి చూపించేలా ఆ సినిమా డిసాస్టర్ అయ్యింది. అయితేనేమి లైగర్ విషయాన్ని పక్కనబెట్టి విజయ్ దేవరకొండ నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. తన నెక్స్ట్ మూవీ ఖుషి కోసం విజయ్ దేవరకొండ అప్పుడే జిమ్ లోకి వెళ్ళిపోయాడు. అయితే బాక్సాఫీసు దగ్గర తీవ్రంగా నిరాశపరిచిన లైగర్ మూవీ ఓటిటి రిలీజ్ అంటూ న్యూస్ మొదలయ్యింది. ఈమధ్యన ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం ప్రకారం ఏ సినిమా అయినా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటిటి రిలీజ్ అన్నారు.
మరి ఆ నిర్ణయాన్ని బింబిసార, కార్తికేయ 2 పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాయి. కానీ లైగర్ డిసాస్టర్ అవడంతో నెలరోజులకన్నా ముందే ఓటిటిలో రిలీజ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ 22 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా లైగర్ స్ట్రీమింగ్ ఉంటుంది అని, రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా లైగర్ ఓటిటి రిలీజ్ పై రావొచ్చని అంటున్నారు. మరి లైగర్ హిట్ అయినట్లయితే గనక అక్టోబర్ 20 వరకు ఓటిటిలో వచ్చేది కాదు.