మహేష్ బాబు సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్ చెయ్యరు. ఆయన అలా నియమం పెట్టుకోలేదు, ఆరు తర్వాత సెట్స్ లో ఉండాలంటే ఉంటారు. కానీ సాయంత్రం ఆరు దాటితే ఫ్రెష్ గా ఉండము, అలిసిపోయి ఉంటాము, నిద్ర వస్తూ ఉంటుంది. సో సీన్స్ లో ఫ్రెష్ గా కనిపించలేం, అందుకే ఆరు గంటల తర్వాత షూటింగ్ చెయ్యలేను అంటారు. ఇదంతా ఎందుకు చెవుతున్నామంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 సెట్స్ లో ఉన్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూట్ రామోజీ ఫిలిం సిటీలో మొదలయ్యింది.
యాక్షన్ పార్ట్ తో మొదటి షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. SSMB28 షూటింగ్ మొదలైనప్పుడే మహేష్ కొత్త లుక్ బయటికి వచ్చేసింది. మళ్ళీ ఈ రోజు మంగళవారం మహేష్ బాబు తన లుక్ ని సెల్ఫీ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ Rest and recharge! #ChillNoons అనే క్యాప్షన్ పెట్టారు. అంటే షూటింగ్ నుండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే రీఛార్జ్ అవుతామనేది ఆయన ఫీలింగ్. మహేష్ షేర్ చేసిన సెల్ఫీ లో ఆయన కొద్దిగా గెడ్డం పెంచి కనిపించారు. మహేష్ షేర్ చేసిన పిక్ నిమిషాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.