రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండడం లేదు. వరుసగా చెయ్యాల్సిన RC15 షూటింగ్ భారతీయుడు 2 వలన బ్రేక్ లు ఇవ్వాల్సి వస్తుంది. దర్శకుడు శంకర్ అటు కమల్ భారతీయుడు 2 షూటింగ్ తో పాటుగా, ఇటు రామ్ చరణ్ RC15 షూటింగ్ చేస్తున్నారు. అంటే ఓ పది రోజులు భారతీయుడు 2, మరో పది రోజులు RC15 షూటింగ్ లెక్కన చేస్తున్నారు. అక్టోబర్ లో 10 రోజుల షెడ్యూల్, నవంబర్ లో 10 రోజుల షెడ్యూల్ శంకర్ ప్లాన్ చేసారు. అందుకే సమ్మర్ లో విడుదల అనుకున్న RC15 ఇప్పుడు దసరా టైం లో రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది అంటున్నారు.
మరి శంకర్ ఎంత స్పీడుగా ఉన్నా భారతీయుడు 2, RC15 ల షూటింగ్ చకచకా అయితే పూర్తి చెయ్యలేరు. అందుకే RC15 విడుదల డిలే అవుతుంది అని, ఓ పర్టిక్యులర్ డేట్ చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ ఇవ్వాలని, అది కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ తో రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ చెయ్యాలని దిల్ రాజు కూడా చూస్తున్నారట. ఎందుకంటే ముందు డేట్ చూసుకోకపోతే హింద్ రిలీజ్ విషయంలో ప్రాబ్లెమ్ అవుతుంది కాబట్టి. ఇక కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న RC15 లో SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు.