పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఆయన అభినులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు మేకర్స్ అయితే ఏమి చెయ్యలేని పరిస్థితి. పవన్ తో సినిమా అంటే లాభాలొచ్చేస్తాయి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తీరు చూసి కక్కలేకమింగలేక ఉన్నారు. ఎప్పుడో మొదలైన హరి హర వీరమల్లు పక్కనబెట్టి మధ్యలో వేరే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు పవన్. మే లో ఆగిన హరి హర వీరమల్లు ఇప్పటికీ పట్టాలెక్కింది లేదు. ఇదిగో అదిగో అనడమే కానీ.. పవన్ రావడం లేదు. అక్టోబర్ నుండి బస్సు యాత్ర అనగానే మళ్లీ మేకర్స్ లో కంగారు. కానీ అది వాయిదా పడింది. దానితో పవన్ షూటింగ్స్ కి హాజరవుతారని అంటున్నారు.
అక్టోబర్ నుండి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి రాబోతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ హరి హర వీరమల్లుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మేకర్స్ నుండి అప్ డేట్ లేకపోయినా.. ఇలాంటి గాసిప్స్ తోనే పవన్ ఫాన్స్ సంతోషపడిపోతున్నారు. హరి హర వీరమల్లు సంగతి ఎలా ఉన్నా.. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మూవీస్ పక్కనబెట్టి నిన్నగాక మొన్న ఒప్పుకున్న తమిళ రీమేక్, అలాగే సుజిత్ తో ఓ మూవీ నవంబర్ నుండి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. చూద్దాం పవన్ ఎప్పుడు సెట్స్ మీద సందడి చేస్తారో అనేది.