కీర్తి సురేష్ ఈ మధ్యన గ్లామర్ డోస్ పెంచింది. సర్కారు వారు పాట లో కళావతిగా మహేష్ పక్కన మాస్ మసాలా సాంగ్ చేసినప్పటినుండి.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ షూట్స్ లో రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ పోతుంది. సోషల్ మీడియాలో తన పెట్ తో అల్లరి చేస్తూ క్యూట్ ఫొటోస్ ని వదులుతూ అందరి అటెన్షన్ తన మీదే ఉండేలా చూసుకుంటుంది. అటు కోలీవుడ్ లోను బిజీగా కనబడుతున్న కీర్తి సురేష్ ఇక్కడ తెలుగులోని బిజీ తారగానే కనిపిస్తుంది.
ఇప్పటికే మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసిలో నటించింది కీర్తి సురేష్. ఇప్పుడు చిరంజీవికి భోళా శంకర్ లో చెల్లెలిగా చేస్తుంది. ఇదే కోవలో ఇప్పుడు మరో మెగా హీరో పక్కన సినిమా చేయబోతుంది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ గ్లామర్ గేట్లు ఎత్తెయ్యడానికి రెడీగా ఉంది. కీర్తి సురేష్ చెయ్యబోయే ఆ మెగా హీరో సినిమా ఏమిటనేది తర్వాతి అప్ డేట్ లో..!