Advertisementt

గాడ్ ఫాదర్ ఓటిటి పార్ట్‌నర్ రివీల్డ్

Mon 19th Sep 2022 06:06 PM
netflix,chiranjeevi,godfather  గాడ్ ఫాదర్ ఓటిటి పార్ట్‌నర్ రివీల్డ్
Godfather OTT Partner revealed గాడ్ ఫాదర్ ఓటిటి పార్ట్‌నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

మలయాళంలో మోహన్ లాల్ నటించి బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి, ఫాన్స్ ని మెప్పించేలా డైరెక్టర్ మోహన్ రాజ మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 న దసరా పండగ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న గాడ్ ఫాదర్ పై ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే తమిళం నుండి నయనతార ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలిగా కనిపించడం, బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ చిరుకి రైట్ హ్యాండ్ కింద నటించడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.  

అయితే తాజాగా గాడ్ ఫాదర్ ఓటిటి పార్ట్నర్ పై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. భారీ డీల్ తో ఒప్పందం కుదరడంతో మేకర్స్ గాడ్ ఫాదర్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. క్రేజీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. నయనతార లెనిన్ సారీస్ లో చాలా హుందాగా కనిపిస్తుండగా.. సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ పాత్రకి పర్ ఫెక్ట్ అనేలా ఉన్నారు.

Godfather OTT Partner revealed:

Netflix Acquires the Streaming Rights of Chiranjeevi Godfather 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ