Advertisementt

బాలయ్యతో మరోసారి నయన్

Mon 19th Sep 2022 02:55 PM
nbk 108,balakrishna,nayanthara  బాలయ్యతో మరోసారి నయన్
NBK 108 heroine Confirmed? బాలయ్యతో మరోసారి నయన్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-నయనతార సింహ చిత్రంలో బెస్ట్ జోడి అనిపించారు. నయనతార సారీస్ లో లుక్స్ పరంగాను, అభినయం విషయంలోనూ అద్భుతంగా కనిపించింది. మరోసారి బాలకృష్ణ తో నయనతార జోడి కట్టబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. అది అనిల్ రావిపూడి తో బాలకృష్ణ చెయ్యబోయే NBK108 కోసం హీరోయిన్ గా నయనతార అయితే బావుంటుంది అని అనిల్ రావిపూడి ఆమెని అప్రోచ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. నయనతార విగ్నేష్ శివన్ తో వివాహానంతరం యాక్టింగ్ కి గుడ్ బై చెబుతుంది అన్నప్పటికీ.. ఆమె పెళ్లి తర్వాత షారుఖ్ తో చెయ్యాల్సిన జవాన్ ని కంప్లీట్ చేస్తుంది. అంతేకాకుండా.. తన కెరీర్ లోనే మైలు రాయి అయిన 75 వ చిత్రాన్ని అనౌన్స్ చేసింది.

అందుకే అనిల్ రావిపూడి నయనతారని బాలయ్య సరసన నటించడానికి ఒప్పించే పనిలో ఉన్నారట. ఈ చిత్రంలో బాలకృష్ణ నడి వయస్సు పాత్రలో ఓ బిడ్డకి తండ్రిగా కనిపించబోతున్నారు. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల కనిపిస్తుంది. ఎన్నడూ చూడని బాలయ్యని తన సినిమాలో చూపిస్తాను అని అనిల్ రావిపూడి ఇంతకుముందే చెప్పారు కూడా. మరి బాలయ్య-నయనతార జోడీని ఊహించుకుంటూ నందమూరి ఫాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

NBK 108 heroine Confirmed?:

NBK 108 heroine Confirmed Balakrishna Romance with Nayanthara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ