యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల కలయికలో ఓ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మొదటగా తారక్ సరసన అనుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. NTR30 టీం ఫస్ట్ ప్రయారిటీ కియారా అద్వానీ. కియారా అద్వానీ కోసం తారక్ పట్టుబట్టినప్పటికీ ఆమె ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో ఆమె డేట్స్ దొరకడం లేదు. తర్వాత అలియా భట్ అనుకుంటే ఆమె ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. తర్వాత పర్సనల్ కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. రీసెంట్ గా రష్మిక మందన్న తారక్ తో రొమాన్స్ చేయబోతుంది అన్నారు.
కానీ ఇప్పుడు ఫైనల్ గా శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ వచ్చి చేరింది. జాన్వీ కపూర్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్-కొరటాల చిత్రం లో ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లే అని తెలుస్తుంది. త్వరలోనే జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ అంటూ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక కొరటాల అక్టోబర్ 5 దసరా ఫెస్టివల్ రోజున పూజా కార్యక్రమాలతో NTR30 స్టార్ట్ చేసి.. వెంటనే తారక్ తో కలిసి రెగ్యులర్ షూట్ కి వెళతారని తెలుస్తుంది.