Advertisementt

టైగర్ నాగేశ్వరరావు లో రేణు దేశాయ్ కేరెక్టర్ రివీల్డ్

Mon 19th Sep 2022 10:10 AM
renu desai,tiger nageswara rao,ravi teja  టైగర్ నాగేశ్వరరావు లో రేణు దేశాయ్ కేరెక్టర్ రివీల్డ్
Renu Desai interesting comments on Tiger Nageswara Rao టైగర్ నాగేశ్వరరావు లో రేణు దేశాయ్ కేరెక్టర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

రవితేజ వరస ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీగా వుంటున్నారు. ప్రస్తుతం ఢమాకా, రావణాసుర తో పాటుగా.. పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు చేస్తున్న రవితేజ మెగాస్టార్ చిరు వాల్తేర్ వీరయ్య లోనూ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అయితే వంశి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు లో పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ నిర్మాత రేణు దేశాయ్ కీలక పాత్ర వహిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో దాదాపుగా 18 ఇయర్స్ తర్వాత రేణు దేశాయ్ చేస్తున్న మొదటి చిత్రంపై ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రేణు దేశాయ్ పంచుకుంది.  

స్టువర్ట్‌ పురం దొంగల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చెయ్యడంతో రేణు దేశాయ్ పాత్రపై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. 

Renu Desai interesting comments on Tiger Nageswara Rao:

Renu Desai comments on raviteja Tiger Nageswara Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ