Advertisementt

బిగ్ బాస్ 6: అనుకున్న ఎలిమినేషనే

Sun 18th Sep 2022 10:11 PM
abhinaya sri,bigg boss 6 telugu,bigg boss  బిగ్ బాస్ 6: అనుకున్న ఎలిమినేషనే
Bigg Boss 6: Abhinaya Sree get evicted బిగ్ బాస్ 6: అనుకున్న ఎలిమినేషనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి వారం ఎవరికి అర్ధమవ్వలేదు కంటెస్టెంట్స్.. అప్పుడే ఎలిమినేషన్ ఎందుకు అన్న కారణంతో బ్రతికి పోయిన అభినయశ్రీ.. రెండో వారం అనుకున్నట్టుగానే హౌస్ ని వీడింది. బిగ్ బాస్ హౌస్ లో కాస్త సైలెంట్ గా ఉంటూ.. గేమ్ మీద ఫోకస్ చెయ్యని అభినయ గత వారమే డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. అక్కడ ఇనాయ తో ఫైనల్ స్టేజ్ లో నించొగా.. ఆ రోజు ఇద్దరూ సేవ్ అయ్యారు. కాని అభినయ ఈరోజు దొరికిపోయింది. గత మూడురోజులుగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అభినయ అంటూ ఓటింగ్స్ చెప్పినట్టుగానే అభినయ వెళ్ళిపోయింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్. అందులో షాని ముందుగా శనివారమే బయటికి వెళ్లగా.. ఈ రోజు ఆదివారం అభినయ వెళ్ళింది.

అది రెడ్డి - అభినయ ఫైనల్ స్టేజ్ లో ఉండగా.. ఆది రెడ్డి సేవ్ అయ్యి అభినయ వెళ్ళిపోయింది. బిగ్ బాస్ లీకులు ఈ సీజన్ లోను నడుస్తున్నాయి. రాత్రి 9 గంటలకు బయటికి రావాల్సిన ఎలిమినేషన్ పేరు మధ్యాన్నమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభినయ ఎలిమినేట్ అవుతుంది అని తెలిసాక ఎవ్వరూ సండే నైట్ ఎపిసోడ్ కోసం వైట్ చెయ్యరు. గత మూడునాలుగు సీజన్స్ లాగే ఈ సీజన్ లోను లీకులు యాజమాన్యాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందులో భాగమే అభినయశ్రీ పేరు ముందుగా బయటికి రావడం.. ఇక ఎటువంటి ఎమోషన్స్ లేకుండానే అభినయ హౌస్ ని, హౌస్ మేట్స్ ని వీడింది.

Bigg Boss 6: Abhinaya Sree get evicted:

Abhinaya Sri Eliminated From Bigg Boss 6 Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ