ఎన్నో ఏళ్ళ ప్రేమని పెళ్లి బంధంతో ముడివేసుకున్న నయనతార-విగ్నేష్ శివన్.. ఎక్కడ కనబడినా చూడముచ్చటైన జంట అనేలా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి తర్వాత దైవ దర్శనాలు పూర్తి చేసుకుని హనీమూన్ లో ఎంజాయ్ చేసి మళ్ళీ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. వర్క్ నుండి కొద్దిగా బ్రేక్ దొరగ్గానే సెకండ్ హనీమూన్ కి స్పెయిన్ చెక్కేసింది ఈ జంట. పెళ్లి కాకముందు కూడా స్పెషల్ అకేషన్స్ కి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసే ఈ జంట పెళ్ళైన తర్వాత ఆగుతుందా.. రోజులకి తరబడి హనీమూన్ ట్రిప్ వేస్తుంది.
తాజాగా నయనతార తన భార్య విగ్నేష్ శివన్ కి ఇచ్చిన సర్ ప్రైజ్ చూసిన విగ్నేష్ తెగ ఆనందపడిపోతున్నాడు. అదేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత మొదటగా వచ్చిన విగ్నేష్ శివన్ బర్త్ డే కి నయనతార విగ్నేష్ కి ఓ మధురమైన గిఫ్ట్ ఇచ్చింది. అది ఏ గోల్డో, ఏదో సినిమా డైరెక్షనో కాదు.. వరల్డ్ లోనే ఎత్తైన కట్టడంగా పేరున్న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ముందు భర్త విఘ్నేష్ శివన్ బర్త్ డేను నయనతార గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. విఘ్నేష్ శివన్ బర్త్ డే వేడుకల్లో విగ్నేష్ శివన్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆ సర్ ప్రైజ్ చూసిన విగ్నేష్ శివన్.. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.
నా వైఫ్ నయనతార అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. నిజంగా నయన్ నా బంగారం. నన్నెంతో ప్రేమించే వ్యక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలను బుర్జ్ ఖలీఫా దగ్గర సెలబ్రేట్ చేసుకోవటం ఒక డ్రీం లా ఉంది. దీని కంటే ప్రత్యేకతను నేను ఊహించలేను. ఇలాంటి అద్భుతమైన లైఫ్ ని, మరువలేని క్షణాలను నాకు ఇచ్చిన ఆ దేవుడికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు.