Advertisementt

బాలయ్య-పవన్ కలిస్తే.. ఆ కిక్కే వేరప్పా

Sun 18th Sep 2022 02:29 PM
pawan kalyan,balakrishna,unstoppable 2  బాలయ్య-పవన్ కలిస్తే.. ఆ కిక్కే వేరప్పా
Pawan Kalyan and Trivikram Srinivas to start Balakrishna Unstoppable 2 బాలయ్య-పవన్ కలిస్తే.. ఆ కిక్కే వేరప్పా
Advertisement
Ads by CJ

క్రేజీ స్టార్స్ ఎప్పడికైనా ఒకసారి కలిస్తే ఫాన్స్ కి వచ్చే కిక్ మాములుగా ఉండదు. అందులో రేర్ కాంబినేషన్స్ కలిసి కనబడితే.. అది మరింత జోష్ గా మారుతుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ-నాగార్జున, బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ-పవన్ కళ్యాణ్, బాలకృష్ణ-చిరంజీవి ఈ జోడీలు ఎక్కడైనా ఎప్పుడైనా కలిసి కనబడితే అభిమానులకి పూనకాలే. ప్రస్తుతం ఇలాంటి రేర్ ఫీట్ ఒకటి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్టేజ్ పై ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అది ఎక్కడంటే ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లు బాలయ్య అన్ స్టాపబుల్ కి గెస్ట్ లుగా తీసుకురాబోతున్నారట అల్లు అరవింద్. ఇలాంటి కలయిక చూడడానికి వెయ్యి కళ్ళతో అభిమానులు వేచి చూస్తుంటే.. ప్రేక్షకులకి కన్నుల పండగే. మరి బాలయ్య-పవన్ కలిసి టాక్ షో లో పాల్గొంటే.. పవన్ వ్యక్తిగత విషయాలు, పొలిటికల్ మాటలు, సినిమాలకు సంబందించిన ప్రశ్నలని బాలయ్య సంధిస్తే.. ఆ కిక్ మరింతగా పెరగడం ఖాయం. అయితే పవన్ కళ్యాణ్ అసలు బాలయ్య షోకి రావడం సాధ్యమేనా అని చాలామందిలో అనుమానాలు ఉన్నప్పటికీ.. అల్లు కాంపౌండ్ లోకి బాలయ్య రాలేదా? అలాగే బాలయ్య షోకి పవన్ కళ్యాణ్ వస్తారు అంటున్నారు కొందరు. మరి ఈ కలయిక కోసం ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా వెయిటింగ్.. 

Pawan Kalyan and Trivikram Srinivas to start Balakrishna Unstoppable 2:

Balakrishna Unstoppable 2 to kickstart with Pawan Kalyan and Trivikram Srinivas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ