ట్రిపుల్ ఆర్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మోగిపోతుంది. ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరూ సోషల్ మీడియాలో మా హీరోలు ఆస్కార్ కి నామినేట్ అయ్యారంటూ భీబత్సం చేస్తున్నారు. మరి ఏ నటుడికైనా ఆస్కార్ అందుకోవాలని కోరిక ఉంటుంది. ఆస్కార్ అనేది హాలీవుడ్ సొంతం అనేవారు. కానీ ఇప్పుడు తమిళ హీరో సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకి ఆస్కార్ కి నామినేట్ అయ్యారు. అలాగే ట్రిపుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రకి ఎన్టీఆర్, తాజాగా రామ్ చరణ్ అల్లూరి పాత్రకి నామినేట్ అయ్యారు. ఆస్కార్ కి ఎన్టీఆర్ నామినేట్ అయిన విషయాన్ని ఆయన ఫాన్స్ గొప్పగా ప్రచారం చేసుకుంటే రామ్ చరణ్ ఫాన్స్ ఫీలయ్యారు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆస్కార్ కి నామినేట్ అయ్యాడని తెలిసి వారు రెచ్చిపోయి పండగ చేసుకుంటున్నారు. అయితే అటు ఎన్టీఆర్ ఫాన్స్ కి మా హీరోకే ఆస్కార్ రావాలని ఉంటుంది, ఇటు మెగా ఫాన్స్ కి మా హీరోకే ఆస్కార్ రావాలనే కోరిక ఉండడంలో తప్పులేదు. అది సహజం కూడా. కానీ ఇక్కడో మెగా ఫ్యాన్ కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఆస్కార్ రావాలని కోరుకోవడం లేదు. వస్తే ఎన్టీఆర్ కి రావాలి, రామ్ చరణ్ కి రావాలి. లేదంటే ఇద్దరికీ ఆస్కార్ వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి అతను కోరుకున్నదానిలో ఎలాంటి స్వార్ధం లేదు. కారణం కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ ఇద్దరూ ఒకరిని మించి మరొకరు కష్టపడ్డారు. అందుకే చాలామంది అభిమానులు వస్తే ఇద్దరికీ ఆస్కార్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.