Advertisementt

చుక్కలు చూస్తోన్న లక్కీ హీరోయిన్

Sat 17th Sep 2022 09:46 PM
krithi shetty,nithin,ram  చుక్కలు చూస్తోన్న లక్కీ హీరోయిన్
Krithi Shetty Upset With 3 flops చుక్కలు చూస్తోన్న లక్కీ హీరోయిన్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోకి లక్కీ బ్యూటీగా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరీ అడుగుపెట్టిన ఉప్పెన బేబమ్మ కృతి శెట్టి కి ఎదురు గాలి స్టార్ట్ అయ్యింది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ తో హిట్ కొట్టి మోడరన్ గాను నిరూపించుకున్న కృతి శెట్టి.. బంగార్రాజు లో నాగ చైతన్య తో పోటాపోటీ పాత్ర వేసి ఆకట్టుకుంది. ఆ సినిమా కూడా కృతి కి హిట్ ఇవ్వడంతో ఆమెని అందరూ లక్కీ గర్ల్ గా జమకట్టేసారు. కుర్ర హీరోలు కూడా ఆమెకి అవకాశాలు ఇచ్చేసారు. వరస అవకాశాలతో చేతి నిండా పనితో బేబమ్మ బాగా సందడి చేసింది. సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ చక్కగా తయారై మీడియా ముందు వాలిపోయింది.

కానీ కృతి శెట్టి కి రామ్ వారియర్ బిగ్ షాక్ ఇచ్చింది. దానితో మొట్ట మొదటి ప్లాప్ కృతి శెట్టి ఖాతాలో పడింది. ట్రెడిషనల్ గా కనిపించినప్పుడే ఆమెకి మంచి హిట్స్ దక్కాయి. మోడరన్ అవతారమెత్తాక ఆమెకి ఆ సక్సెస్ దూరమైంది. ఆ వెంటనే నితిన్ మాచర్ల నియోజక వర్గం మరో షాకిచ్చింది. ఆ సినిమా తో కృతి శెట్టి బాగా డిస్పాయింట్ అయ్యింది. ఇక ఇప్పుడు సుధీర్ బాబు కూడా అమ్మడుకి హిట్ ఇవ్వలేకపోయాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ చేసిన కృతి శెట్టి కేరెక్టర్ గురించి ఏమో కానీ ఆ సినిమా బాలేదంటూ ఆడియన్స్ చేతులెత్తేశారు. ఇంద్రగంటి-సుధీర్ బాబు ల కానుకలో వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకి కనీసం సో.. సో టాక్ కూడా రాలేదు. దానితో ముచ్చటగా మూడో ప్లాప్ కృతి ఖాతాలో వచ్చి పడింది. నిన్నటివరకు లక్కీ అన్నవాళ్ళే ఇప్పుడు పాపని చూస్తే ఐరెన్ లెగ్ అనేస్తున్నారు. అనూహ్యమైన విజయంతో ఉప్పెనలా వచ్చిపడ్డ ప్రేక్షకుల అభిమానంతో ఉక్కిరిబిక్కిరైన ఈ అమ్మడు ఇప్పుడు అనుకోని అపజయాలతో చుక్కలు లెక్కెడుతుంది. మళ్ళీ తన దశ దిశా మారుతుందా.. ఆల్ ద బెస్ట్ అమ్మడూ...

Krithi Shetty Upset With 3 flops:

Krithi Shetty scores three flops back-to-back

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ